క్రైమ్/లీగల్

త్వరగా నిర్ణయం తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఉన్నావో రేప్ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం చేకూర్చడానికి వీలుగా ప్రత్యేక న్యాయమూర్తిని నియమించడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు సూచించింది. ఉన్నావో కేసు బాధితురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి వద్దకే వెళ్లి, బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోవడానికి న్యాయమూర్తిని నియమించాలని సుప్రీంకోర్టు స్పెషల్ జడ్జి ధర్మేష్ శర్మ సూచించారు. ఎయిమ్స్‌లో కెమెరాలు ఉంచి, బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి అనుమతించాలని ఆయన ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు ఒక లేఖ రాశారు. కాగా, న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, అనిరుద్ధ బోస్‌తో కూడిన ప్రత్యేక బెంచ్ ఈ కేసును విచారించి, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఉన్నావో రేప్ కేసు బాధితురాలు ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంపై పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఉద్దేశపూర్వకంగానే ఆమెను హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో జరిగిన ఉన్నావో రేప్ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ నుంచి సస్పెండైన నిందిత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై పోస్కో చట్టాన్ని అమలుపరచి, ప్రత్యేక కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సమాజంలోని దాదాపు అన్నివర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసు ను సుప్రీంకోర్టు కూడా చాలా కీలకంగా భావించింది. ప్రత్యేకించి నిందితురాలిపై హత్యాప్రయత్నం జరిగిందన్న అనుమానాలపై దృష్టి సారించింది. వెంటనే తగిన దర్యాప్తు జరిపి నివేదికను ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. అదే సమయంలో ఎయిమ్స్‌లో బాధితురాలిని విచారించడానికి తగిన వాతావరణం కల్పించాలని సూచించింది.
జరిమానా రద్దుకు నిరాకరణ
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధికారిపై విధించిన 50 వేల రూపాయల జరిమానాను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ అంతర్భాగంగా ప్రకటించి, రెం డు లోక్‌సభ స్థానాలుగా విభజించాలని కోరుతూ ‘రా’ మాజీ అధికారి రామ్‌కుమార్ యాదవ్ సుప్రీంకోర్టులో ప్రజావ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి కేసులను వేయడం సబ బు కాదని స్పష్టం చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాకుండా సున్నితమైన అంశాన్ని కోర్టులో ప్రస్తావించినందుకు అతనిపై 50 వేల రూపాయలు జరిమానా విధించింది. దీనిని రద్దు చేయాల్సిందిగా రామ్‌కుమార్ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం కోర్టు తోసిపుచ్చింది.