క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, సెప్టెంబర్ 6: విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడులో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన చంద్ర(25), ఈరన్న(23) పొలానికి నీరందించేందుకు హంద్రీనీవా కాలువలో విద్యుత్ మోటార్ అమర్చారు. అది మరమ్మతులకు గురవడంతో శుక్రవారం వెలికి తీస్తుండగా ఇతర విద్యుత్ మోటార్ల ద్వారా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.