క్రైమ్/లీగల్

తిరుమల కొండల్లో ఏసు మందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 6: స్థానిక తిమ్మినాయుడుపాళెం అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌ను చూపి సోషల్ మీడియాలో ఏసు మందిరం అంటూ దుష్ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించి తప్పుడు ప్రచారం చేసిన కాటేపల్లి అరుణ్‌కుమార్ (24), కార్తీక్, అజిత్ షా చక్రవర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని, వారి సెల్‌ఫోన్లను సీజ్ చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన అరుణ్‌కుమార్, గరికపాటి కార్తీక్ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉంటూ ఈ దుష్ప్రచారానికి పాల్పడ్డారని తెలిపారు. తిమ్మినాయుడుపాళెం అటవీ బీట్‌లో మొండోడి కోన వద్ద నెంబర్ 118 టవర్‌ను ఐవీఐఎస్ కెమేరా కోసం ఏర్పాటు చేసిన పైప్‌ను శిలువగా చిత్రీకరిస్తూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినట్లు అంగీకరించారన్నారు. ఇదే ఫొటోను మిక్కిలినేని సాయి, అజిత్ చక్రవర్తిలు సోషల్ మీడియాలో పోస్టు చేశారని తెలిపారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా తప్పుడు ప్రచారం చేసిన వీరిని అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానంతో డీఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి శుక్రవారం హైస్కూల్ మైదానంలో వున్న నిందితులను అరెస్టు చేశారని ఎస్పీ వివరించారు. సోషల్ మీడియాలో పోస్టు చేసే ముందు పూర్తిస్థాయిలో నిర్ధారణ చేసుకోకుండా అసత్య ప్రచారం చేసినా, దుష్ప్రచారం చేసినా ఎంతటివారికైనా చట్టప్రకారం శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో తిరుమల డీఎస్పీ ప్రభాకరబాబు, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.