క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌జోగిపై ఎఫ్‌ఐఆర్ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, సెప్టెంబర్ 6: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎస్టీ కులానికి చెందినట్లుగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించిన కేసులో ఈయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు జనతా కాంగ్రెస్ (జే) నాయకుడు శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కాగా, చత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జోగి.. ప్రస్తుతం ఢిల్లీలోని ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. షెడ్యూల్డు తెగకు చెందిన వ్యక్తిగా నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన కేసులో జోగిపై బిలాస్‌పూర్ జిల్లా గౌరెలా పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ‘వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం అజిత్ జోగి ఢిల్లీలో ఉన్నారు.. గురువారం అర్ధరాత్రి ఆయనకు శ్వాసకోశ సమస్య ఎదురవడంతో గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని’ ఆయన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పరేష్ బగ్‌బాహ్రా తెలిపారు. ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం జోగి రాజకీయాల్లోకి వచ్చారు. 73 సంవత్సరాల జోగి ప్రస్తుతం నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించిన కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. భారత శిక్షా స్మృతి కింద సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 467 (్ఫర్జరీ), 468 (్ఫర్జరీ, మోసం), 471 (్ఫర్జరీ డాక్యుమెంట్ / ఎలక్ట్రానిక్ రికార్డు) సెక్షన్ల కింద అజి త్ జోగిపై కేసులు నమోదయ్యాయి. నకిలీ ధ్రువీకరణ పత్రా న్ని సమర్పించారని బీజేపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సమీరా పైక్రా ఫిర్యాదు మేరకు జోగిపై కేసులు నమోదయ్యా యి. అజిత్‌జోగి కేసుపై నియమించిన కమిటీ ఆయన ఎస్టీ వర్గానికి చెందిన వారు కాదని పేర్కొంటూ నివేదిక సమర్పించింది. ఈ మేరకు బిలాస్‌పూర్‌లోని సివిల్‌లైన్స్ పోలీస్ స్టేషన్‌లో సైతం జోగిపై ప్రత్యేక కేసు గత వారం నమోదైంది. రా ష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి స్క్రూటినీ కమిటీ తన నివేదికలో అజిత్‌జోగి ఎస్టీ కుల ధ్రువీకరణను తిరస్కరిస్తూ ఆయనకు సంబంధించిన అన్ని పత్రాలను రద్దు చేసిం ది. ఇదే కేసులో అజిత్‌జోగి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగిని ఈనెల మూడో తేదీన అరెస్టు చేశారు.