క్రైమ్/లీగల్

నాగార్జున వర్సిటీ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 6: ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారని అందిన ఫిర్యాదు మేరకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జవ్వాది శ్రీనివాసరావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గుంటూరు ఏసీబీ యూనిట్ నుంచి అడిషనల్ ఎస్సీ ఏ సురేష్‌బాబు ఆధ్వర్యంలో గుంటూరు, విజయవాడకు చెందిన ఏసీబీ సిబ్బంది ఆరు బృందాలుగా విడిపోయి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని శ్రీనివాసరావు ఇంటితో పాటు నరసరావుపేట ప్రాంతంలోని శ్రీనివాసరావు తల్లి, బంధువుల నివాస గృహాల్లోను తనిఖీలు జరిపారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అడిషనల్ ఎస్పీ సురేష్‌బాబు తెలిపారు. ఆరు బృందాలుగా విడిపోయి తనిఖీలు జరుపుతున్నామన్నారు. కీలకమైన దస్తావేజులు, బంగారు ఆభరణాలు, నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. ఇతర ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నందున పూర్తి వివరాలు తనిఖీలు పూర్తయ్యాక వెల్లడిస్తామని సురేష్‌బాబు వెల్లడించారు. నరసరావుపేట మండలంలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు తల్లివద్ద, అన్నవరం, మరికొన్ని గ్రామాల్లోను తనిఖీలు జరుపుతున్నట్లు చెప్పారు.