క్రైమ్/లీగల్

కుమార్తెలపై తండ్రి లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 6: ఎవరైనా వేధిస్తుంటే పిల్లలు తండ్రితో చెప్పుకుంటారు.. కానీ ఆ తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ చిన్నారులు రెండేళ్లుగా నిత్యం నరకం చవిచూశారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఒకరికి తెలియకుండా ఒకరిని బెదిరించి ముగ్గురు కూతుళ్లను లోబరుచుకున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు ధైర్యం చేసిన వారు తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం నగరంలో శుక్రవారం వెలుగుచూసిన ఈ దారుణం సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా చేసింది. రెండేళ్లుగా కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్న తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని నీరుగంటివీధిలో జరిగిన ఈ దారుణ సంఘటన విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయని పోలీసులు తెలిపారు. వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగరంలోని నీరుగంటివీధికి చెందిన మసూద్‌వలి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు. మైనర్లయిన వీరిని ఒకరికి తెలియకుండా మరొకరిని బెదిరించి ముగ్గురిపైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రెండేళ్లుగా వీరిని వేధించాడు. తండ్రి వేధింపులను వౌనంగా భరించిన ఆ పిల్లలు చివరకు తల్లికి చెప్పారు. దీంతో ఆమె సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.