క్రైమ్/లీగల్

పిల్లల్ని పనికి పంపితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 6: చదువుకునే వయస్సులో పిల్లలను పనికి పంపితే సంబంధిత తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. రాష్ట్రంలో రోజురోజుకూ బాలల అదృశ్య ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ పేరిట వీధి బాలల గుర్తింపు కార్యక్రమాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా 693 బృందాలు వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 1371 మంది వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. వీరిలో 1192 మంది బాలురు, 179 మంది బాలికలు ఉండగా 286 మంది బాలబాలికలను తల్లిదండ్రులకు అప్పగించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. కేవలం మన రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన 70 మంది బాలలను గుర్తించి వారిని చైల్డ్‌కేర్ హోమ్స్‌కు తరలించామన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్‌లు, సినిమా థియేటర్ ప్రాంగణాలు, పార్కులు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఈ తనిఖీల్లో అనాథ బాలలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాల బాలికలను గుర్తించి, వారికి భోజన సదుపాయాలను కల్పించి, చిరునామా తెలిసిన వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. ఇకపై పిల్లలను యాచక వృత్తిలోకి దింపినా, బాల కార్మికులుగా మార్చినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.