క్రైమ్/లీగల్

నకిలీ పాస్ పోర్టుల ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 6: గల్ఫ్ దేశాల నుండి తిప్పి పంపేసిన వారి చేతి వేళ్లకు శస్తచ్రికిత్సలు చేయడం ద్వారా వేలిముద్రలు మార్చి, నకిలీ పాస్‌పోర్టులతో వారిని తిరిగి విదేశాలకు పంపిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు. జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ శుక్రవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ముఠా సభ్యుల వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా రాంబాబు, వీరా త్రిమూర్తులు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కొండెంరెడ్డి రాజారెడ్డి, కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ మహ్మద్ ముజఫర్, శ్రీలంక దేశానికి చెందిన మహ్మద్ జాఖీర్ హుస్సేన్‌ను అరెస్టుచేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి కొన్ని నకిలీ పాస్‌పోస్టులు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.29వేల నగదు, చేతి వేళ్లకు సర్జరీ చేయడానికి ఉపయోగించే సర్జికల్ కిట్, స్టెతస్కోప్, బీపీ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ముఠా కార్యకలాపాలపై ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్‌కు అందిన సమాచారంతో ఏలూరు స్పెషల్ బ్రాంచి డీఎస్పీ కె శ్రీనివాసాచారి పర్యవేక్షణలో నరసాపురం డీఎస్పీ కె నాగేశ్వరరావుఆధ్వర్యంలో భీమవరం రెండో పట్టణ సీఐ ఆర్ విజయ్‌కుమార్, పాలకొల్లు పట్టణ సీఐ సిహెచ్ ఆంజనేయులు, వారి వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, ముఠా కదలికలపై నిఘావుంచి, నిందితులను అరెస్టుచేశారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీలు, సీఐలు, వారి సిబ్బందిని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ అభినందించారు.