క్రైమ్/లీగల్

రూ.1.40లక్షల బంగారు ఆభరణాల స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 7: గత ఏడాది గుడివాడ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన దొంగతనం కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారు. శనివారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీఐ ఎల్ రమేష్ నిందితురాలు, బంగారు ఆభరణాలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సీఐ రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్‌లో హ్యాండ్‌బ్యాగ్‌లో బంగారు వస్తువులు పోగొట్టుకున్న మచిలీపట్నానికి చెందిన బడుగు ఫ్రాన్సిస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. పట్టణంలోని గంగానమ్మ వీధికి చెందిన గండికోట దుర్గను అదుపులోకి తీసుకుని రూ.90వేల విలువైన బంగారు నక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే మండవల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో 24గ్రాముల బంగారు చైన్‌ను కూడా స్వాధీనం చేసుకుని నిందితురాలు దుర్గను పీడీఎం కోర్టులో హాజరుపర్చామన్నారు. న్యాయమూర్తి దుర్గకు రిమాండ్ విధించినట్టు సీఐ రమేష్ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ యూ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.