క్రైమ్/లీగల్

వంటి నిండా బంగారంతో మురిపించి రూ. 8 లక్షలతో యువకుడు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 7: తక్కువ ధరకే బంగారం లభిస్తుందని నమ్మించి ఓ పెళ్లి వారిని రూ. 8 లక్షల మేరకు మోసగించి పరారైన నిందితునిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వారణాసిలో పరిచయమైన యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం వాసులను విజయవాడకు రప్పించి రూ. 8 లక్షలతో ఉడాయించాడు. టీ నర్సాపురానికి చెందిన అట్లారి విజయలక్ష్మి(44)కి ముగ్గురు మగ పిల్లలున్నారు. వారిలో రెండో కుమారుడు భార్గవ కర్నాటకలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం భార్గవ వారణాసి వెళ్లాడు. అక్కడ శ్రీ్ధర్‌కృష్ణ అనే యువకుడు పరిచయమై మాటామాటా కలిపాడు. తాను సంబంధాలు చూస్తానని, వివాహాది శుభ కార్యాలకు అతి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానన్నాడు. అంతలో భార్గవ అన్నయ్యకు సంబంధం కుదిరింది. వంటినిండా బంగారు గొలుసులు, చేతికి బంగారు మురుగులు, చేతివేళ్లకు ఆకర్షణీయమైన ఉంగరంతో టిప్‌టాప్‌గా కన్పించే శ్రీ్ధర్ కృష్ణ గుర్తుకొచ్చాడు. వెంటనే అతడిని సంప్రదించారు. తాను విజయవాడ వస్తున్నానని, బంగారం కొనిస్తానని విజయలక్ష్మిని, భార్గవని శుక్రవారం విజయవాడకు రప్పించాడు. ఓ బంగారం షాపులో వారి కళ్లదుటే మెడలోని గొలుసుని అమ్మాడు. అది గమనించిన తల్లి, కుమారుడు అతని వల్లో పడ్డారు. వారిని ఓ లాడ్జీలో ఉంచాడు. వారి వద్ద రూ. 8లక్షలు దండుకున్నాడు. బంగారం వేరేచోట ఉంచాను, మూడు గంటల వ్యవధిలో వస్తానని నమ్మబలికిన మాయగాడు మాయమయ్యాడు. బాధితులు పలుమార్లు ఫోన్‌లు చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం రాత్రి కేసు పెట్టారు. పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు అర్ధరాత్రి దాటాక కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.