క్రైమ్/లీగల్

స్నేహితులతో కలిసి పెదనాన్న ఇంట్లో యువకుడి చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 7: స్నేహితులతో కలిసి సొంత పెదనాన్న ఇంట్లోనే యువకుడు చోరీకి పాల్పడిన కేసులో ఐదుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 477 గ్రాముల (సుమారు అరకేజీ) బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏసీపీ కే శ్రీనివాసరావు తెలిపారు. వన్‌టౌన్ పోలీస్టేషన్ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేసే వన్‌టౌన్ శివాలయం వీధికి చెందిన వర్షిల్ జైన్ (24), పాత బేరింగుల వ్యాపారం చేసే ఇస్లాంపేటకు చెందిన మహ్మద్ నూరుద్దీన్ (28), చదువుకుంటున్న చిట్టినగర్ కేఎల్ రావు నగర్‌కు చెందిన ఎండి అబూబకర్ సిద్దిక్ (22), ఆటోడ్రైవర్ షేక్ జానీబాష (23), బంగారం దుకాణంలో పనిచేసే గుమస్తా పూలబావి వీధికి చెందిన సునీల్ దేవాసిన్ (23)లను నిందితులుగా అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల్లో వర్షిల్ జైన్, నూరుద్దీన్ స్నేహితులు కాగా అబూబకర్ సిద్దిక్, జానీబాష, దేవాసిన్‌లు నూరుద్దీన్‌కు స్నేహితులు. అయితే ఈ కేసులో ఫిర్యాది అయిన మగన్‌లాల్‌కు ప్రధాన నిందితుడు వర్షిల్ జైన్ స్వయానా సోదరుని కుమారుడు. పెడదారి పట్టిన వర్షిల్ జైన్ ఫైనాన్స్ వ్యాపారం చేసే సొంత పెదనాన్న ఇంటికే కన్నం వేశాడు. ఈ క్రమంలో స్నేహితులను కలుపుకుని ఆగస్టు 30న ఇంటి తలుపులు పగులగొట్టి అరకేజీ బంగారు నగలు అపహరించారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేసి వారి నుంచి సుమారు 16లక్షల విలువైన సుమారు అరకేజీ నగలు రికవరీ చేసినట్లు ఏసీపీ వివరించారు. విలేఖరుల సమావేశంలో సీఐ కృష్ణంరాజు, పీ వెంకటేశ్వర్లు, రామ్‌కుమార్, చలపతిరావు, ఎస్‌ఐలు నాగ శ్రీనివాస్, కృష్ణారావు, కిషోర్, తిరుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.