క్రైమ్/లీగల్

తప్పుడు ధ్రువపత్రాలతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 7: తపాలా శాఖలో బ్రాంచి పోస్ట్ఫాసులో పోస్టుమ్యాన్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన ఐదుగురు అభ్యర్థులు తప్పుడు స్టడీ సర్ట్ఫికెట్ దాఖలా చేసినందుకు వారిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల పోస్ట్ఫాసుల్లో పోస్టుమ్యాన్‌ల ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మందికి రాతపరీక్షలు నిర్వహించింది. విజయవాత పాతబస్తీలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఐదుగురుకి సంబంధించిన స్టడీ సర్ట్ఫికెట్లపై అధికారులకు అనుమానం వచ్చింది. సదరు సర్ట్ఫికెట్ జారీ చేసిన యూనివర్శిటీ వారికి సమాచారం అందించారు. ఓపెన్ యూనివర్శిటీలో 10వ తరగతి పాసైనట్లుగా జారీ చేసిన ఆ సర్ట్ఫికెట్స్ నకిలీవని తేలింది. యూనివర్శిటీ రికార్డుల్లో వేరేవారి పేర్లుండగా నిందితులు దాఖలా చేసిన సర్ట్ఫికెట్లలో వారి పేర్లు, ఫొటోలు మార్ఫింగ్ చేసినట్లుగా గుర్తించారు. భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన కూచిపూడి సురేష్‌కుమార్, వరంగల్‌కి చెందిన సోలా అర్జున్, నల్గొండ జిల్లా సీతారాంపురానికి చెందిన కే సైదులు, కృష్ణా జిల్లా ఐనంపూడి గ్రామానికి చెందిన మల్లవీర వెంకట్రావు, విజయవాడ పాతబస్తీ కొప్పులవారి వీధికి చెందిన కర్రి పూర్ణిమ అనే ఐదుగురు మోసపూరితంగా బ్రాంచి పోస్టుమ్యాన్‌లు కావాలని అధికారులకు తప్పుడు ధ్రువపత్రాలు దాఖలా చేశారని ప్రధాన తపాలా కార్యాలయం ఉన్నతాధికారి అభిజిత్ దిలీప్‌రావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ డీ కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.