క్రైమ్/లీగల్

నీకో పదివేలు... నాకో పదివేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 7: చిన్న తరహా పరిశ్రమ స్థాపనకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికునికి అనుమతి మంజూరుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికార్ల కథనం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన నీలం రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి సామర్లకోటలోని సెజ్‌లో ‘రాజేంద్ర ప్రింట్స్ అండ్ ప్యాక్స్’ పేరిట ఒక చిన్నతరహా పరిశ్రమ స్థాపనకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకున్నారు. ఈ పరిశ్రమ స్థాపనకు ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అనుమతి మంజూరుచేయాల్సివుంది. అయితే రెండు నెలలైనా అనుమతి రాకపోవడంతో రాజేంద్రప్రసాద్ కాకినాడలోని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ
సందర్భంగా అనుమతి మంజూరుకు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌కు, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌కు చెరో రూ.10వేల వంతున లంచం డిమాండ్‌చేశారు. విసుగుచెందిన రాజేంద్రప్రసాద్ రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికార్లను సంప్రదించారు. వారి సూచనల మేరకు శనివారం కాకినాడలోని కార్యాలయానికి వెళ్లారు. రాజేంద్రప్రసాద్ నుండి రూ.10వేల వంతున లంచం తీసుకుంటున్న ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఇందూరి నారాయణరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ జామి సన్యాసిరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుండి లంచం సొమ్ము రూ.20వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ ఆరెస్టుచేసి, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ పి రామచంద్రరావు, ఇన్‌స్పెక్టర్లు విప్పర్తి పుల్లారావు, పీవీజీ తిలక్, పీఎస్ సూర్యమోహనరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు.