క్రైమ్/లీగల్

కానిస్టేబుల్ కల నెరవేరకుండానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 9: కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉందామనుకున్న ఓ యువకుని ఆశలు అడియాసలయ్యాయి. కొలువు కోసం వచ్చిన ఆ యువకుడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా విశాఖలో సోమవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా పరుగు పోటీని పూర్తి చేసి సొమ్మసిల్లి పడిపోయి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఒక అభ్యర్థి మృతి చెందాడు. నగరంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కానిస్టేబుళ్ళ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా సోమవారం దేహదారుఢ్య, పరుగు పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా, సొంతబొమ్మాళి మండలం, చాకిపల్లి, చిన్నతుంగం గ్రామానికి చెందిన పర్రి రామకృష్ణ పాల్గొన్నాడు. దేహదారుఢ్య పరీక్ష అనంతరం ఐదు కిలోమీటర్ల పరుగులో పాల్గొన్న తర్వాత ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ప్రాథమిక వైద్యం అందించి ఆ తరువాత కేజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరిలించారు. ఎస్సై శ్రీను నేతృత్వంలో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.