క్రైమ్/లీగల్

కరకట్టపై రెండు కార్లు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 10: తోట్లవల్లూరు కరకట్టపై మంగళవారం రెండు కార్లు ఢీ కొన్న సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పులిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ అదుపుతప్పి విజయవాడ నుండి మోపిదేవి గుడికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న నవీన్‌రెడ్డి ష్కోడా కారును పాములలంక సమీపంలో ఢీకొంది. ఈ ఘటనలో స్విఫ్ట్ కారు నడుపుతున్న సతీష్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ష్కోడా కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావటంతో వారికి ఎటువంటి దెబ్బలు తగలలేదు. కారులో ఉన్న నాలుగురు క్షేమంగా బయట పడ్డారు. తీవ్ర గాయాలైన సతీష్‌కుమార్‌ను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మళ్లీ అక్కడ నుండి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ చిట్టిబాబు పరిశీలించి అక్కడ వారికి సహాయ సహకారాలు అందించి వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా అదుపుతప్పిన స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టకుంటే నేరుగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లి పెనుప్రమాదానికి గురయ్యేదని, ఈ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.