క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, సెప్టెంబర్ 10: స్థానిక 11వ వార్డులో సోమవారం జరిగిన ఓ సంఘటనలో ప్రమాద వశాత్తు యువకుడు నిప్పంటుకుని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ చల్లా కృష్ణ తెలియజేశారు. కొలగాని మురళీ (44) తన ఇంటి వద్ద పాత దుస్తులను తగులబెడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ మంటలు ఎగసిపడటంతో నిప్పంటుకుని ప్రమాదానికి గురయ్యాడని తెలిపారు. మురళీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తొలుత అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకపోవటంతో మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి పంపామని, వైద్య చికిత్స జరిపినా ఫలితం లేకపోయిందని, మురళీ సోమవారం రాత్రి మృతి చెందాడని మంగళవారం విలేఖర్లకు తెలిపారు. మృతుడు మురళీ భార్య సీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతుడికి ఇరువురు కుమారులు ఉన్నారని ఎస్‌ఐ వివరించారు.