రాష్ట్రీయం

ఆరుగురు చిన్నారులు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి కోట, సెప్టెంబర్ 10: ఆంధ్రా సరిహద్దు కర్నాటక రాష్ట్రం మరదగట్టు గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనంలో ఆరుగురు చిన్నారులు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం మరదగట్టు గ్రామంలో వినాయక చవితి పర్వదినాన విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం గ్రామంలోని చిన్నారులు, యువకులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు నీటికుంటలో తొలిగా ఇద్దరు చిన్నారులు పడడాన్ని గమనించిన తోటి స్నేహితులు వారిని రక్షించే క్రమంలో ఇద్దరు ఇద్దరుగా మొత్తం ఆరుగురు నీటికుంటలో మనిగిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు చిన్నారులను నీటికుంట నుంచి వెలికితీసి చికిత్స నిమిత్తం హుటాహుటిన కేజీఎఫ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ముగ్గరు మృతి చెందగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో మరదగుట్టకు చెందిన ఉషా కుమార్తెలు తేజస్విని (11), రక్షిత (8), రవికుమార్ పిల్లలైన రోహిత్ (8), వైష్ణవి (11), ఆనందప్ప కుమార్తె వీణ (11), నారాయణ స్వామి కుమారుడు ధనూష్ (7) మరణించారు. ఒకే గ్రామంలో ఆరుగురు చిన్నారులు గణేష్ నిమజ్జనంలో మృతి చెందారన్న వార్త సరిహద్దు గ్రామాల్లో విషాదాన్ని నింపింది.

చిత్రం...నీటికుంటలో పడి మృతి చెందిన చిన్నారులు