క్రైమ్/లీగల్

లారీ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, సెప్టెంబర్ 10: లారీ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘడ్ ప్రాంతానికి చెందిన ఆనంద్ (28), హరితన్ (24), సస్మేల్ (22), అంకిరెడ్డిపల్లిలోని బాలాజీ ఫార్మా కంపెనీలో హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం అంకిరెడ్డిపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ముగ్గురు కీసర వైపు వస్తున్నారు. ముందు వెళుతున్న లారీనీ అధిగమించే ప్రయత్నం చేయగా, ఎదురుగా వస్తున్న బోలెరో వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ముగ్గురు యువకులను, ద్విచక్ర వాహనాన్ని లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. వీరిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని 108 సిబ్బంది తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
కొడంగల్, సెప్టెంబర్ 10: అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్‌లను కొడంగల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. కొస్గి మండలంలోని బోగారం గ్రామం నుంచి అక్రమంగా కొడంగల్‌కు ఇసుక తరలిస్తున్న సమయంలో కొడంగల్‌లో పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా ఇసుక రవాణా ట్రాక్టర్‌లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ రఫిక్ బేగం తెలిపారు.