క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, సెప్టెంబర్ 10: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కాచిగూడ ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన వట్టిపల్లి ఎల్లయ్య - సత్తమ్మ దంపతుల చిన్న కూతురు గౌతమి(31)కి సికింద్రాబాద్ గ్యాస్‌మండి ప్రాంతానికి చెందని కర్ర శ్రీశైలం, అరుణజ్యోతి దంపతుల కుమారుడు మధుకర్(40)తో 2018లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.18లక్షల కట్నం ఇచ్చి ఘనంగా జరిపించారు. గౌతమి ప్రభుత్వ విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేస్తుడడంతో మధుకర్ కోరియర్ బిజినెస్ చేస్తున్నాడు.
భర్త, అత్తింటి వారితో నిత్యం గొడవలు ఉండేవని, ఆడబిడ్డలు శిరీష, శ్రీలత, స్వప్న కూడా గౌతమిని వేధింపులకు గురి చేస్తూ ఉండేవారని కుంటుంబ సభ్యులు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గౌతమి బర్కత్‌పురలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చింది.
అప్పటి నుంచి గౌతమిని భర్త మధుకర్ ఇంటికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ గొడవ పడేవాడని చెప్పారు. మంగళవారం ఉదయం గౌతమి తల్లి సత్తమ్మ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటిపైన కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని గౌతమి ఆత్యహత్య చేసుకుంది. ఇరుగుపొరుగు గుర్తించి ఇంటి తలుపులు తెరచి చూడగా మంటల్లో గౌతమి కాలిపడిపోయింది. పోలీసులు చేసుకుని దర్యాప్తు చేశారు.