క్రైమ్/లీగల్

డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 10: డివైడర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డ సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ నుండి నిర్మల్‌కు బయలుదేరిన ఏపి 01 టిఎ 1008 నంబరు గల ఆర్టీసీ బస్సు నిర్మల్ శివారులోని గంజాల్ టోల్‌గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొట్టింది. టోల్‌ప్లాజా వద్ద గల ఫాస్ట్‌ట్యాగ్ లేన్‌లోకి వేగంగా వచ్చిన బస్సు ఒక్కసారి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 25 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి సోన్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుండి నిర్మల్ వస్తుండగా డ్రైవర్ బి.మనోహర్ అతివేగంగా బస్సును నడుపుతూ టోల్‌ప్లాజా డివైడర్‌ను ఢీకొట్టాడు. డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న నిర్మల్‌కు చెందిన జాదవ్ వసంత, కొరుట్లకు చెందిన దుర్గం వౌనిక, దుర్గం రేఖ, దుర్గం రమేష్, భైంసాకు చెందిన అహెమది, నిజామాబాద్‌కు చెందిన కామారపు నరేష్, శబానాలకు గాయాలయ్యాయ. అలాగే నిజామాబాద్ జిల్లా నందిపేట్‌కు చెందిన సి.హెచ్.లక్ష్మీ, గుత్పకు చెందిన ఎం.సునీత, ఎం.లావణ్య, బోథ్‌కు చెందిన వి.శంకర్, హైదరాబాద్‌కు చెందిన ఆర్.నరేష్‌కుమార్, నిర్మల్‌కు చెందిన ఫైజుల్లాఖాన్‌లకు గాయాలయ్యాయ. వీరందరినీ నిర్మల్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలను అందజేశారు. ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేనట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై రవీందర్ పేర్కొన్నారు.
చిత్రాలు.. డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
* క్షతగాత్రులకు సహాయం చేస్తున్న టోల్‌ప్లాజా సిబ్బంది