క్రైమ్/లీగల్

పెన్‌డ్రైవ్‌లో సాక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: బీజేపీ సీనియర్ నేత చిన్మయానంద తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ యూపీకి చెందిన ఒక మహిళ, ఇందుకు అవసరమైన సాక్ష్యాధారాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని స్పష్టం చేసింది. తన స్నేహితురాలు దానిని ఇప్పటికే పోలీసులకు అప్పగించిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇనె్వస్టిగేటివ్ టీమ్ (సిట్) బుధవారం ఆ మహిళను సుమారు 15 గంటల పాటు విచారించినట్టు సమాచారం. కాగా, సుప్రీంకోర్టుకు సాక్ష్యాధారాలతో కూడిన పెన్‌డ్రైవ్ చేరిందని 23 ఏళ్ల బాధితురాలు తెలిపింది. అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో సభ్యుడుగా ఉన్న చిన్నయానంద తనపై అత్యాచారం చేసి, ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని ఆమె తెలిపింది. అంతేకాకుండా అసభ్య వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి అప్‌లోడ్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. తాను స్నానం చేస్తున్నపుడు చిన్మయానంద ఈ వీడియోలు తీసినట్టు ఆమె తెలిపింది. గత ఏడాది లా కాలేజీలో అడ్మిషన్ కోసం తాను చిన్మయానంద వద్దకు వెళ్లినట్టు ఆమె తెలిపింది. ఆయన తనకు సహకరించి, కాలేజీ లైబ్రరీలో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని, హాస్టల్‌ను మారాలని సూచించారని బాధిత మహిళ తెలిపింది. న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆమె తెలిపింది. ఇలావుంటే, చిన్మయానంద తరఫు న్యాయవాది ఓం సింగ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇదంతా ఓ కట్టుకథ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నేత చిన్మయానందపై ఉద్దేశపూర్వకంగా ఆమె ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. ఆయనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో ఇది ఒక భాగమని వ్యాఖ్యానించారు. నిజానిజాలు విచారణలో వెల్లడవుతాయని ఆయన అన్నారు.