క్రైమ్/లీగల్

కుటుంబాలతో కలవడానికి 8మంది బాలికలకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: బిహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోంకు చెందిన 44 మంది బాలికల్లో ఎనిమిది మంది తిరిగి వారి కుటుంబాలతో కలవడానికి సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది. ఈ ఎనిమిది మంది బాలికలకు అవసరమయిన అన్ని ఆర్థిక, వైద్య సహాయాలను అందించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి బాధితులకు నిర్దిష్ట పథకం కింద చెల్లించవలసి ఉన్న నష్టపరిహారాన్ని అంచనా వేసి కోర్టుకు ఒక నివేదిక సమర్పించాలని కూడా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగతా బాలికలకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను తయారు చేసి ఎనిమిది వారాలలోగా కోర్టుకు సమర్పించాలని కూడా న్యాయమూర్తులు ఎంఎం శంతనగౌడర్, అజయ్ రస్తోగి సభ్యులుగా గల సుప్రీంకోర్టు ధర్మాసనం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ (టిస్)ను ఆదేశించింది. టిస్ తన క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రాజెక్టు ‘కోశిష్’ను సీల్డ్ కవర్‌లో పెట్టి కోర్టుకు సమర్పించిన తరువాత ధర్మాసనం పై ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది మంది బాలికలు తిరిగి వారిని వారి కుటుంబాలకు అప్పగించడానికి యోగ్యులుగా ఉన్నారని టిస్ ‘కోశిష్’లో పేర్కొంది. టిస్ సామాజిక తనిఖీ నిర్వహించి, నివేదిక రూపొందించడంతో ఈ విష యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ 44 మంది బాలికలు వారి కుటుంబాలతో కలిసి రాష్ట్రంలోని వివిధ షెల్టర్ హోమ్‌లలో ఉన్నారు. అయితే, ఈ 44 మంది బాలికల పునరావాస ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తూ బిహార్ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది.