తెలంగాణ

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాజిపేట, సెప్టెంబర్ 12: పనిభారం తట్టుకోలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామంలో చోటు చేసుకుంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శి స్రవంతి (30) కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కార్యాలయం సమీపంలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు దీనిని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు తెలియచేసి, సర్పంచ్‌తో కలిసి తిమ్మాజిపేట పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించి జడ్చర్ల సివిల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడున్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకొని పోవాలని సూచించడంతో హుటాహుటిన అక్కడికి తరలించారు.
స్రవంతికి భర్త చనిపోగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు తట్టుకోలేక పోతున్నట్టు తరచుగా అంటుండేదని తెలిపారు.