క్రైమ్/లీగల్

ఎంబీబీఎస్ సీటు పేరుతో రూ.15లక్షలు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 12: తన కుమారుడిని ఎలాగైనా ఎంబీబీఎస్ చేయించాలన్న ఆ తండ్రి అత్యాశ దుఃఖానికి దారి తీసింది. తన కుమారుడు నీట్‌లో క్వాలీఫై కాకపోయినా గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని ఎంబీబీఎస్ సీటు కోసం రూ.15లక్షలు ఆన్‌లైన్ పేమెంట్ చేసి బోల్తా పడ్డాడు. మీ అబ్బాయి నీట్‌లో క్వాలీఫై కాకపోయినా మేనేజ్‌మెంట్ కోటాలో సీటు ఇప్పిస్తామని గుర్తుతెలియని వ్యక్తి నుండి వచ్చిన ఎస్‌ఎంఎస్‌ను ఏ మాత్రం నిజ నిర్ధారణ చేసుకోకుండా అతను చెప్పిన విధంగా రూ.15లక్షలు చదివించి నిలువునా మోసపోయిన బాధితుడు చిట్ట చివరకు గురువారం పోలీసులను ఆశ్రయించాడు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మోసం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాచవరానికి చెందిన కట్టా నాగ మోహనరావు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గత ఆగస్టు 7వతేదీన నాగ మోహనరావు 9051332411 నెంబర్ ఫోన్ నుండి డా. నీరజ్ మెహతా పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. తాము లేబర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారమని, తమ డిపార్టుమెంట్‌కు ఇఎస్‌ఐసీ అండ్ ఇడబ్ల్యుఎస్ కింద మొత్తం 260 ఎంబీబీఎస్ సీట్లలో తమకు 22 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారని, ఆ సీట్లు నీట్‌లో 400 మార్కులు పైబడిన వారికి మాత్రమే ఇప్పించగలమని, మీ అబ్బాయికి ఏపీ నీట్‌లో 405 మార్కులు వచ్చినందున మీకు ఎంబీబీఎస్ సీటు ఇస్తామని ఆ మెసేజ్ సారాంశం. ముందుగా సెంట్రల్ మినిస్టరీ రికమండేషన్ చార్జీలను రూ.45వేలు చెల్లించమన్నారు. ఈ మొత్తాన్ని బాధితుడు ఆగస్టు 17వ తేదీన అతని ఎస్‌బీఐ బ్యాంక్ ఎకౌంట్ ద్వారా ఎస్‌బీఐ న్యూఢిల్లీ, డాక్టర్ పంకజ్ కుమార్ శర్మ (డెప్యూటీ సెక్రటరీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎకౌంట్‌కు ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు. ఆ తర్వాత సెంట్రల్ రికమండేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.9లక్షలు చెల్లించాల్సిందిగా సదరు వ్యక్తి ఆదేశించాడు. ఇందులో తొలిగా రూ.4.50లక్షలు రికమండేషన్ ఆఫ్ ది కాండిడేట్‌కి కట్టాలి. మిగిలిన రూ.4.50లక్షలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి నీట్ అప్రూవ్ అయిన తర్వాత కట్టాలన్నారు. రూ.9లక్షలకు సంబంధించి అక్నాలెడ్జిమెంట్ ఇస్తామని తెలిపాడు. ఈ మొత్తాన్ని ఎంబీబీఎస్ కోర్సు పూర్తన తర్వాత రెండు సంవత్సరాలు బాండ్ మీద ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు కింద కాలేజీ పేరు మీద రూ.1.25లక్షలు డిడి ద్వారా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇలా సదరు వ్యక్తి చెప్పినట్టు బాధితుడు రూ.15లక్షలు మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశాడు. చివరి ఈ నెల 6వతేదీన కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ వద్దకు వస్తే పర్మిషన్ ఆర్డర్ ఇస్తానని చెప్పాడు. తీరా బాధితుడు కాలేజీ వద్దకు వెళ్లి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చ్ఫా వచ్చింది. కాలేజీలో సంప్రదించగా మీరు మోసపోయినట్టు కాలేజీ యాజమాన్యం చెప్పింది. దీంతో లబోదిబోమంటూ బాధితుడు గురువారం చిలకలపూడి సీఐ వెంకట నారాయణను కలిసి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.