క్రైమ్/లీగల్

యూపీ మంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి రామ్‌మందిర్, అయోధ్యలోని వివాదాస్పద స్థలం మాదిరిగానే అత్యున్నత న్యాయస్థానం కూడా ‘మాదే’ అని చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం కేసును విచారిస్తుండగా సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముస్లిం పక్షాల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముస్లిం పక్షాల తరపున వాదిస్తున్నందుకు గత వారం తనకు ఫేస్‌బుక్ పేజీ ద్వారా బెదిరింపు సందేశం వచ్చిందని, కొంత మంది బుధవారం తన గుమాస్తాను దూషిస్తూ కొట్టారని కూడా ధావన్ కోర్టుకు తెలిపారు. ‘దేశంలో ఇలాంటివి జరుగకూడదు. న్యాయస్థానం ముందు తమ వాదనలను స్వేచ్ఛగా వినిపించే హక్కు ఇరు పక్షాలకు ఉంది’ అని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం గురువారం 22వ రోజు విచారణను ప్రారంభించడానికి సమావేశమయిన కొద్ది సేపటికే ధావన్ ఈ రెండు ఘటనలను కోర్టుకు తెలియజేస్తూ విచారణకు అనుకూలమయిన, సరయిన వాతావరణం కోర్టులో ఉందే తప్ప బయట లేదని పేర్కొన్నారు.