క్రైమ్/లీగల్

చిదంబరానికి మళ్లీ నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి న్యాయస్థానంలో మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్ కేసులో కోర్టులో లొంగిపోతానని ఆయన చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌కుమార్ కుహర్ తోసిపుచ్చారు. పిటిషన్‌ను కొట్టివేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం కోర్టులో వాదించింది. ఆ కేసులో మరింత లోతుగా విచారించేందుకు తమకు తగిన సమయం కావాలని ఈడీ కోరింది. ఈడీ వాదనను చిదంబరం పక్షాన వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వ్యతిరేకించారు. తన క్లయింట్‌ను మరింత ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశంతోనే ఈడీ వ్యవహరిస్తోందని సిబాల్ ఆరోపించారు. 73 ఏళ్ల చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఇప్పటికే జుడీషియల్ కస్టడీలో ఉన్నారని, కేసును సీబీఐ విచారిస్తోందని ఆయన కోర్టుకు తెలిపారు. అందువల్ల సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఈడీ వాదన సరికాదని ఆయన పేర్కొన్నారు. గత నెల 20,21 తేదీల్లో చిదంబరంను అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారని సిబాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. జుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని విచారించేందుకు ఈడీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని, లొంగిపోతానంటే అభ్యంతరం ఎందుకని ఆయన అడిగారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ నిర్ధిష్ట అంశాలపై ఆయనను విచారించాల్సి ఉందని వెల్లడించారు.