క్రైమ్/లీగల్

వ్యాధుల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ముసురుతున్న వ్యాధులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వివరించాలని హైకోర్టు ఆదేశించింది. గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ వ్యాధి సోకిన రోగుల సంఖ్య ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో ఉందని కారణాలను వివరించాలని హైకోర్టు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ,రాష్ట్ర ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్‌ను విచారించిన హైకోర్టు స్వైన్‌ఫ్లూ, మలేరియా, డెంగ్యూ వ్యాధుల రోగుల చికిత్సలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ సౌకర్యాలను కల్పించాలని ప్రశ్నించింది. రోగుల సంఖ్య పెరగడంతో వారందరినీ ప్రైవేటు ఆస్పత్రులకు పంపుతున్నారని, అది పేద రోగులపై పెనుభారం అవుతోందని పిటిషనర్ పేర్కొన్నారు.
దీనిపై ప్రభుత్వం తన వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయగా, ప్రభుత్వ నివేదిక అసంపూర్ణంగా ఉందని , సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది.అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రతి ఆస్పత్రిలో కల్పించిన సౌకర్యాలను సమగ్రంగా పేర్కొనాలని ఆదేశించింది. వైద్యులు, పడకలు ఎన్ని అదనంగా కల్పించారో కూడా చెప్పాలని పేర్కొంది. పిటిషనర్ తరఫున ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. డెంగ్యూ వ్యాధితో ఎవరూ మరణించలేదన్న ప్రభుత్వ వాదనలను పిటిషనర్ విబేధించగా, వాస్తవాలను సరిపోల్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు.
41ఏ రద్దు చేయండి
సీఆర్‌పీసీ 41ఏ రద్దు చేయాలని , యువ న్యాయవాదులకు స్ట్ఫైండ్ చెల్లింపు, ఇతర సమస్యలను పరిష్కరించాలనలి కోరుతూ తెలంగాణ యువ న్యాయవాదుల జేఏసీ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయదేవతకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పొన్నం రవీందర్ మాట్లాడుతూ అత్యంత దుర్బర జీవితాన్ని గడుపుతున్న న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, గిరీష్, శివకుమార్, జానయ్య, రాజేష్, సఫిక్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.