క్రైమ్/లీగల్

మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు సజీవ సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 13: పాడుబడిన బావిని పూడ్చిపెట్టే సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... కాకినాడ ద్వారకానగర్ రైల్వేగేటు సమీపంలో గుర్రాల లక్ష్మికాంత్, గుర్రాల రామనాథంకు చెందిన ఇంటి వద్ద సుమారు 50 ఏళ్ల క్రితం తవ్విన బావివుంది. వాడకం లేక బావి పాడుబడిపోవడంతో దాన్ని పూడ్చి వేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు గురువారం నుండి పనులు ప్రారంభించారు. గోడపుష్టి సత్యనారాయణ (40), సలాది శ్రీను (45) అనే కూలీలు పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం పనుల్లో పాల్గొన్న వారు 15 అడుగుల లోతున్న బావిలోకి దిగి, పాత ఇటుకలను తవ్వి వెలికితీస్తున్నారు. అప్పటివరకు పనులు పర్యవేక్షిస్తున్న ఇంటి యజమాని లక్ష్మీకాంత్ భోజనం చేయడానికి ఇంట్లోకి వెళ్లారు. కొద్దిసేపటికి పనులు జరుగుతున్న అలికిడి లేకపోవడంతో బయటకు వచ్చిన లక్ష్మీకాంత్ బావి వద్దకు వెళ్లారు. అప్పటికే బావి మొత్తం మట్టిపెళ్లలతో కప్పివేసివుంది. దీనితో లక్ష్మీకాంత్ అగ్నిమాపక శాఖ అధికార్లకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మట్టిపెళ్లలను వెలికితీసేసరికి, సత్యనారాయణ, శ్రీను మృతిచెందివున్నారు. పనులు జరుగుతున్న సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడిపోవడంతో వాటికింద చిక్కుకుని ఊపిరాడక చనిపోయినట్టు నిర్ధారించారు. కాకినాడ రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.