క్రైమ్/లీగల్

18 మంది ఐఏఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి మూడున్నర నెలలు దాటినా, అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు నగర పాలక సంస్థల కమిషనర్లు సహా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అజయ్ జైన్‌ను గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న అనంతరామును సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండీగా జైన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కాంతిలాల్ దండేను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్‌ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్‌గా నియమించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ భాను ప్రకాష్‌ను ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా, మైనారిటీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఉషాకుమారిని ఆయుష్ కమిషనర్‌గా, ఇప్పటి వరకూ అక్కడ పని చేసిన పీఏ. శోభను గిరిజన సహకార సంస్థ ఎండీగా నియమించింది. గిరిజన సహకార సంస్థ ఎండీ టీ. బాబూరావు నాయుడును పునరావాస విభాగం స్పెషల్ కమిషనర్‌గా, పునరావాస విభాగం స్పెషల్ కమిషనర్ రేఖా రాణిని కార్మిక శాఖకు బదిలీ చేసింది. జాయింట్ సెక్రటరీ (విజిలెన్సు) కె.శారదా దేవిని మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న చెరుకూరి శ్రీ్ధర్‌ను సీసీఎల్‌ఏలో జాయింట్ సెక్రటరీగా, గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. శ్రీకేష్ బాలాజీరావును మార్క్‌ఫెడ్ ఎండీగా, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ సుమిత్ కుమార్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీగా, కర్నూలు మున్పిపల్ కమిషనర్ ఎం. అభిషిక్త్ కిషోర్‌ను రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎం.నంద కిషోర్‌ను ఏపీటీఎస్ ఎండీగా, డి.వాసుదేవ రెడ్డిని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఎం.మధుసూదన రెడ్డిని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా, వి.రామకృష్ణను ఇంటర్మీడియట్ విద్య స్పెషల్ కమిషనర్‌గా నియమించింది. ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ ఎన్.చంద్రమోహన్ రెడ్డికి ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

నలుగురు జిల్లా రిజిస్ట్రార్ల బదిలీ
ప్రొద్దుటూరు జిల్లా రిజిస్ట్రార్ ఎల్.వెంకటేశ్వర్లును ఏలూరుకు బదిలీ చేశారు. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌ను కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ ఎం.అబ్రహంను నెల్లూరుకు, గూడూరు జిల్లా రిజిస్ట్రార్ గంగిరెడ్డిని శ్రీబాలాజీ రిజిస్ట్రేషన్ జిల్లాకు బదిలీ చేసింది.

ముగ్గురు ఐఎఫ్‌ఎస్ అధికారుల కేటాయింపు
రాష్ట్రానికి ఇండియన్ ఫారెస్టు సర్వీస్ (2019 బ్యాచ్)కు చెందిన ముగ్గురిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సి.చైతన్య కుమార్ రెడ్డి, నిషా కుమారి, వివేక్‌లను కేటాయించింది.