క్రైమ్/లీగల్

యజమానుల నుంచి పరిహారం వసూలు చేసి బాధిత రైతులకు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఆక్వా చెరువులతో కడలి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని సంబంధిత చెరువుల యజమానుల నుంచి వసూలు చేసి రైతులకు ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. రాజోలు మండలం కడలి గ్రామంలో పంట పొలాల మధ్య రొయ్యల చెరువులుగా మార్చుతున్నారని, దీని మూలంగా పంటనష్టం జరుగుతోందని కడలి రైతుల సంఘం నేతృత్వంలో ఎన్జీటీకి లేఖ రాశారు. దీనిని స్వీకరించిన ఎన్జీటీ సమగ్ర నివేదిక నివ్వాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి గతంలో ఆదేశించింది. అక్రమ చెరువులను గుర్తించి తొలగించినట్టు కాలుష్య నియంత్రణ మండలి నివేదికను ఇచ్చింది. పంట నష్టం వ్యవహారం రెవెన్యూ శాఖ బాధ్యత అని నియంత్రణ మండలి న్యాయవాది తెలిపారు. దీంతో స్పందించిన ఎన్జీటీ ధర్మాసనం పంట నష్టం అంచనా వేసి సంబంధిత చెరువల యజమానుల నుంచి వసులు చేసి రైతులకు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ కేసును ముగించింది.