క్రైమ్/లీగల్

కారు బోల్తా: ఐదుగురు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు అదుపుతప్పి బోల్తాపడి దగ్ధం కావడంతో మంటల్లో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. తన మామ అనారోగ్యంతో బెంగళూరులో ఆసుపత్రిలో ఉండగా పరామర్శించేందుకు భార్య, పిల్లలు, చెల్లెలు, చెల్లెలు కుమారుడు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న పోలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారు డోర్లు అన్నీ లాక్ అయిపోవడం, రోడ్డు పక్కన బోల్తాపడటంతో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. డోర్లన్నీ లాక్ అయిపోవడంతో కారులోనే ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు. సమీపంలోని అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో కారులోని ఒకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. మిగిలిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పలమనేరు డీఎస్పీ ఆరీఫుల్లా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. పలమనేరు డీఎస్పీ ఆరీపుల్లా కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన విభాగంలో డేటాబేస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న విష్ణు పదోన్నతిపై రెండు రోజుల క్రితం తిరుమల
పేస్కార్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. విష్ణు, అతని భార్య జాహ్నవి, కుమారుడు పావన్‌రామ్, కుమార్తె సాయి అశ్విత, చెల్లెలు కళావతి, చెల్లెలు కుమారుడు భానుతేజ్ పోలో కారులో బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న విష్ణు భార్య జాహ్నవి తండ్రిని పరామర్శించారు. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు కావడంతో పిల్లలు సైతం వెంట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గంగవరం మండలం మామడుగు మలుపువద్ద కారు అదుపుతప్పడంతో ఒక్కసారిగా బోల్తాపడింది. కారులోని డోర్లన్నీ లాక్ అయిపోవడంతో, పెట్రోల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓవైపు మంటలు చెలరేగుతున్నప్పటికీ కారులో ఉన్న విష్ణు కారు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. అప్పటికే స్థానికులు మంటలు ఆర్పే యత్నం చేసినా మిగిలిన ఐదుగురిని కాపాడలేకపోయారు. తీవ్రంగా గాయపడ్డ విష్ణును 108 ద్వారా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో విష్ణు భార్య జాహ్నవి, కుమార్తె సాయిఅశ్విత, కుమారుడు పవన్‌రామ్, చెల్లెలు కళావతి, చెల్లెలు కుమారుడు భానుతేజ్ కారులోనే సజీవ దహనమైనట్లు పలమనేరు డీఎస్పీ ఆరీపుల్లా వెల్లడించారు. తీవ్రంగా గాయపడ్డ విష్ణును వేలూరు సీఎంసీకి తరలించి, సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

*చిత్రం...అగ్నికి ఆహుతి అవుతున్న కారు