క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.24 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 14: శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో వందలాది మంది బాధితులకు న్యాయం జరిగింది. వారిలో సీనియర్ లాయర్, కాంగ్రెస్ నాయకుడు నరహరశెట్టి నరసింహరావు వాదించిన రోడ్డు ప్రమాద మృతుని కుటుంబానికి ఆర్థికపరమైన న్యాయం జరిగింది. ఇటీవల బెంజి సర్కిల్ సమీపంలోని ఫకీరుగూడెం స్కూృబిడ్జీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 22సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు కోర్టులో సాగుతున్నాయి. మృతుడు మల్ల సుబ్రహ్మణ్యం(22) కుటుంబం తరపున నరహరశెట్టి నరసింహరావు న్యాయవాదిగా నిలబడ్డారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో పలుమార్లు సంప్రదింపులు సాగించారు. శనివారం కోర్టుల ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులకు రూ. 24 లక్షల అవార్డు కాపీని అందించారు. రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, పీదీ రాంబాబు, రాధారత్నం, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు ఎస్ మురళీకృష్ణ, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ సమక్షంలో లాయర్ నరహరశెట్టి నరసింహారావు చేతులమీదుగా అవార్డు కాపీని అందించారు. తమ తరపున వాదించి న్యాయం చేసిన నరసింహరావుని లబ్ధిదారులు అభినందించారు.