క్రైమ్/లీగల్

లోక్ అదాలత్‌లో 10 సివిల్, 66 క్రిమినల్ కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, సెప్టెంబర్ 14: జాతీయ లోక్ అదాలత్ లో 10 సివిల్, 66 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. శనివారం స్థానిక కోర్టులో లోక్ అదాలత్ ద్వారా గన్నవరం సీనియర్ సివిల్ జడ్జి ఎ అనిత, న్యాయవాది దాసరి భాగ్యలక్ష్మితో కూడిన మొదటి బెంచ్, అదన పు జూనియర్ సివిల్ జడ్జి డి షర్మిల, న్యాయవాది వేణుబాబుతో కూడిన రెండో బెంచ్‌ల ద్వారా సివిల్, క్రీమినల్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 66 క్రిమినల్ కేసుల్లో రాజీమార్గం ద్వారా రూ.25,36,900 విలువ గల కేసులను పరిష్కరించారు. 99 సంవత్సరాల వయస్సు గల బొమ్మారెడ్డి శ్రీరావమ్మ లోక్ అదాలత్‌లో రాజీపడటం విశేషం. బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనుమోలు వెంకటేశ్వరరా వు, సీనియర్ న్యాయవాది పీవీ రమణ, కిషోర్, ఎజిపీ సోమేశ్వరరావు, శారద, విమల్‌కుమార్, కక్షిదారులు పాల్గొన్నారు.