క్రైమ్/లీగల్

ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ‘ఆట’ కట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని టౌన్, సెప్టెంబర్ 14: పేకాటరాయుళ్లను తారుమారు చేసి అడ్డంగా దొరికిపోయారు కర్నూలు జిల్లా కోసిగి పోలీసులు. విషయం ఎస్పీ దృష్టికి రావడంతో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. కర్నూలు జిల్లా కోసిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నభూంపల్లి గ్రామంలో పట్టుబడిన పేకాటరాయుళ్ల కేసులో నలుగురు నిందితులను తారుమారు చేసిన సంఘటనలో కోసిగి ఎస్‌ఐతోపాటు ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గతనెల 14వ తేదీ చిన్నభూంపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.
ఈ కేసులోని నిందితులను ఈనెల 13వ తేదీ ఆదోని ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హజరు పర్చగా 7 రోజుల జైలు శిక్ష, రూ.300 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అయితే కేసులో నలుగురు అసలు నిందితులను తప్పించి వేరేవారిని కోసిగి పోలీసులు కోర్టులో హాజరు పరచడంతో శిక్ష పడిన బోగస్ నిందితులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. టూటౌన్ సీఐ అబ్దుల్‌గౌస్, ఎస్‌ఐ నాగేంద్ర శుక్రవారం రాత్రి విచారణ జరపడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితులను తప్పించి వారి స్థానంలో బోగస్ నిందితులను పెట్టిన వైనంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. కోసిగి ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ ఏసేబు, చిన్నభూంపల్లి గ్రామ కానిస్టేబుల్ తిప్పన్న, కోర్టు కానిస్టేబుల్ రామాంజినేయులుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు.
అలాగే వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా బోగస్ నిందితులుగా కోర్టుకు వెళ్ళిన లక్ష్మన్న, దస్తగిరి, చంద్ర, పెద్దహుసేన్‌పై కూడా కేసు నమోదు చేశారు. శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పేకాట ఆడిన భూంపల్లి గ్రామానికి చెందిన తిక్కొడు, తిప్పన్న, గోవిందు, రంగయ్య, రాముడు, రోగోడు, చిన్నరామయ్య, కొర్రయ్య, చిన్న బుల్లోడు, శివపై కేసు నమోదు చేశారన్నారు. ఇందులో నలుగురిని పోలీసులు తారుమారు చేసి బోగాస్ నిందితులను కోర్టులో హాజరు పరిచారని వివరించారు. ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ ఏసేబు, కోర్టు కానిస్టేబుళ్లును ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.