క్రైమ్/లీగల్

బ్యాంకుకు బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 15: బ్యాంకును బురిడీ కొట్టించిన బంగారం విలువ కట్టే వాల్యుయర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కస్టమర్లను సృష్టించి, నకిలీ బంగారం పెట్టించి ఏకంగా రూ.3.77 కోట్ల రూపాయలను ఆ బ్యాంకు నుంచి తీసుకుని జల్సా చేసిన వాల్యుయర్ ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.
ఇక్కడి అంటోప్ హిల్‌కు చెందిన 43 ఏళ్ళ రామస్వామి నాదర్‌ స్థానిక ఇండియన్ బ్యాంకు ధర్వాయి బ్రాంచ్‌కు వాల్యుయర్‌గా రెండేళ్ళ క్రితం నియమితులయ్యాడు. ఈ బ్యాంకుకు సమీపంలోనే బంగారు ఆభరణాల షాపును నిర్వహిస్తున్నాడు. ఇలాఉండగా ఇటీవల బ్యాంకు కొన్ని ఆస్తులను విక్రయించాలన్న ఉద్దేశ్యంతో లాకర్లను తెరిపించింది. ఇందులో 77 ప్యాకెట్లలో పసుపు రంగు గల నకిలీ ఆభరణాలు (ఇత్తడి) కనిపించాయి. ఇవి నకిలీ అని గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే ధర్వాయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన వాల్యుయర్ రామస్వామి నాదర్ నకిలీ బంగారాన్ని దాదర్‌లో ఖరీదు చేసి 12 మంది నకిలీ కస్టమర్లను సృష్టించి బ్యాంకును మోసగించాడు. ఈ నకిలీ కస్టమర్లు బ్యాంకుకు వచ్చి బంగారంపై రుణం కావాలని కోరడం, ఆ వెంటనే బ్యాంకు అధికారులు ఈ వాల్యుయర్ నాదర్‌ను పిలిపించి బంగారాన్ని పరీక్షించాల్సిందిగా చెప్పడం జరిగిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ సురేష్ పాటిల్ తెలిపారు. ముందుగా సృష్టించిన నకిలీ కస్టమర్లు కాబట్టి ఇది మేలైన బంగారం అంటూ వాల్యుయర్ సర్ట్ఫికేట్ జారీ చేయడం జరిగేదని ఇన్‌స్పెక్టర్ వివరించారు. ఇలా మొత్తం రూ.3.77 కోట్లు బ్యాంకు నుంచి నకిలీ కస్టమర్ల ద్వారా తీసుకుని, వారికి కొద్ది మొత్తంలో డబ్బు ఇచ్చి పంపించేవాడని ఆయన చెప్పారు. నకిలీ కస్టమర్ల ద్వారా తీసుకున్న డబ్బులతో నాదర్ ధర్జాగా కాలం గడిపాడని, ఆస్తులు కూడగట్టాడని, కార్లు, ద్విచక్ర వాహనాలు ఖరీదు చేసినట్లు గుర్తించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అరెస్టు చేసిన రామస్వామి నాదర్‌ను స్థానిక కోర్టులో హాజరుపరిచామని, ఈ నెల 17 వరకు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్ సురేష్ పాటిల్ తెలిపారు. 12 మంది నకిలీ కస్టమర్లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారని ఆయన చెప్పారు.