క్రైమ్/లీగల్

ప్రత్యక్ష ప్రసారం సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదంపై రోజువారీగా జరుగుతున్న విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేయడం సాధ్యమో కాదో తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారంనాడు రిజిస్ట్రీని ఆదేశించింది. సాధ్యమైతే ఇందుకు ఎంత సమయం పడుతుందో కూడా తమకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం రిజిస్ట్రీని కోరింది. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ సిద్ధాంతకర్త కేఎన్ గోవిందాచార్య తరఫున మాట్లాడిన సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ ‘సుప్రీంకోర్టు పట్ల పిటిషనర్లకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అయితే, ఈ కేసులో అనేకమంది పిటిషనర్లు రోజువారీ విచారణకు హాజరు కాలేకపోతున్నారు. అంతేకాదు, ఈ విచారణను చూసే అవకాశం కూడా వారికి లేదు. ప్రత్యక్షంగా వాటిని ప్రసారం చేస్తే విచారణ వివరాలను వారు తెలుసుకోగలుగుతారు’ అని అన్నారు. అయితే, ఈ ప్రసారాలకు ఎంత సమయం పడుతుందన్నది రిజిస్ట్రీ తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా బెంచ్ స్పష్టం చేసింది. రోజువారీ విచారణకు ప్రత్యక్షంగా ప్రసారం చేయడం సాధ్యం కాకపోతే కనీసం విచారణను ఆడియోలో రికార్డు చేయాలని గోవిందాచార్య తన పిటిషన్‌లో కోరారు. గతంలో రాజ్యాంగ, జాతీయ ప్రాధాన్యం కలిగిన కేసులను ప్రత్యక్షంగా ప్రసారం చేయడాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాది వికాస్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.