క్రైమ్/లీగల్

ఫరూక్ అబ్దుల్లాకు ఇల్లే జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 16: కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లాను అత్యంత కఠినమైన ప్రజా భద్రతా చట్టం కింద సోమవారంనాడు అరెస్టు చేశారు. ఆయన ఉన్న ఇంటినే జైలుగా ప్రకటించారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసినప్పటినుంచి ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అబ్దుల్లాను అన్యాయంగా నిర్బంధించారంటూ ఎండీఎంకే నాయకుడు వైగో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి కొన్ని గంటల ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా భద్రతా చట్టంలోని శాంతి భద్రతల నిబంధన కింద ఫరూక్ అబ్దుల్లాను నిర్బంధించారని, ఎలాంటి విచారణ లేకుండా మూడు నుంచి ఆరు నెలల పాటు ఆయనను ‘జైల్లోనే ఉంచవచ్చునని’ అధికారులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పీఎస్‌ఏ చట్టం కింద అబ్దుల్లాకు నోటీసు జారీ చేశారు. ఆయన ఉంటున్న గుప్తార్ రోడ్‌లోని ఇంటినే జైలుగా ప్రకటించినట్టు అధికారులు వెల్లడించారు. నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్‌గా కూడా అయిన 81 సంవత్సరాల అబ్దుల్లా ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. పేస్ మేకర్‌ను కూడా ఆయనకు అమర్చారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై పీఎస్‌ఏ చట్టాన్ని అమలు చేయడం అన్నది ఇదే మొదటిసారి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో, ఆయన ఇంటికి దారితీసే మార్గాన్ని మూసివేశారు. పీఎస్‌ఏ చట్టంలో రెండు కీలక సెక్షన్లు ఉన్నాయి. ఒకటి ప్రజా భద్రత కాగా, రెండోది రాష్ట్ర భద్రతకు ముప్పు అన్న అంశం. మొదటి నిబంధన కింద అరెస్టు చేస్తే మూడు నుంచి ఆరు నెలల వరకు విచారణే అవసరం లేదు. రెండో నిబంధన కింద అదుపులోకి తీసుకుంటే రెండేళ్లవరకు విచారణ ఊసే ఉండదు. ప్రజా భద్రతా చట్టం కింద ఫరూఖ్ అబ్దుల్లాను నిర్భంధించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దేశం కోసం పాటుపడ్డ నేతలు జైలుపాలు కావడం దేశ దురదృష్టం అని వ్యాఖ్యానించింది. ఆయనకు పూర్తిగా అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదం పూర్తిగా తొలగిపోవడానికి కారణం తమ పార్టీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపిలు చేసిన కృషేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ అన్నారు.
*చిత్రం...నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఇంటి సమీపంలో సోమవారం మోహరించిన పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది