క్రైమ్/లీగల్

కేసీఆర్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఎర్రమంజిల్ భవనాలను కూల్చి అక్కడ అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం నాడు 111 పేజీల తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేసుకు సంబంధించి దాఖలైన ప్రజావ్యాజ్య పిటిషన్లలో అంశాలను లోతుగా చర్చించింది. మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని తప్పుపట్టడమేగాక, చారిత్రాత్మక భవనాలను కూల్చాలనే నిర్ణయం సరైంది కాదని పేర్కొంది. కొత్త భవనాలను నిర్మించాలనే యోచన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి సహేతుకత, సరైన కారణాలు లేవని, దానికి రాజ్యాంగ నైతికత లేదని తేల్చిచెప్పింది. ఎర్రమంజిల్ చారిత్రక భవనాలను కూల్చివేసి అదే ప్రదేశంలో అసెంబ్లీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే హైకోర్టులో తొమ్మిది ప్రజా ప్రజావ్యాజ్య పిటిషన్లు దాఖలయ్యాయి. శంకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (64), లుబ్న సర్వత్ (65), ప్రొఫెసర్ పీఎల్ విశే్వశ్వరరావు (73), ఒమిమ్ మానిక్‌షా దెబ్రా (75), డక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (79), ఒమిమ్ మానిక్‌షా దెబ్రా (80),
హైదరాబాద్ జిందాబాద్ (81), డాక్టర్ మిర్ అస్గర్ హుస్సేన్ (86) ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై హైకోర్టులో మూడు నెలలపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఒకపక్క కేసు విచారణ జరుగుతుండగానే మరోపక్క ఎర్రమంజిల్‌లోని చారిత్రత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిపూజ కూడా చేసింది. వీటన్నింటినీ ఉమ్మడిగా విచారించిన ధర్మాసనం సుదీర్ఘ వాదనల అనంతరం సోమవారం తన తీర్పును వెలువరించింది. పురాతన చారిత్రక భవనాలను కూల్చివేయడాన్ని తప్పుపట్టింది. అర్బన్ ఏరియా చట్టం సెక్షన్ 59 కింద రూపొందించిన జోనల్ రెగ్యులేషన్స్ 1981లో ఉన్న న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2010 మాస్టర్ ప్లాన్‌లోని అంశాలను కూడా ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో కొన్ని ప్రాంతాలను స్పెషల్ రిజర్వేషన్ జోన్లుగా ప్రకటించిందని, హెచ్‌ఎండీఏ చట్టం పరిధిని కూడా విస్మరించిందని, హెచ్‌ఎండీఏ చట్టంలోని సెక్షన్ 18ని పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టు వివరించింది. మాస్టర్ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాలంటే అనుసరించాల్సిన విధానాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, హెచ్‌ఎండీఏ చట్టం సెక్షన్ 19 ఉనికికి పట్టించుకోలేదని పేర్కొంది. ఒకవేళ చారిత్రక భవనాలను కూల్చివేసే యోచన చేస్తే అందుకు జోనింగ్ రెగ్యులేషన్స్ 1981 సెక్షన్ 13(2) నిబంధనలను పాటించాల్సి ఉండగా ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదని, నేరుగా సాధించలేని లక్ష్యం కోసం ప్రభుత్వం పరోక్షంగా సాధించాలని చూసిందని, ప్రభుత్వం హెచ్‌ఎండీఏ సెక్షన్ 15కు విరుద్ధంగా నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ప్రజావ్యాజ్య పిటిషన్ 360/2015కు సంబంధించి హెరిటేజ్ భవనాలలో ఎలాంటి మార్పులు చేయాలన్నా హైకోర్టు అనుమతి పొందాలని 2016 ఏప్రిల్ 18న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం విస్మరించిందని వారసత్వ సంపద పరిరక్షణ ఆర్టికల్ 21కింద నిర్వచించిన జీవించే హక్కులో భాగమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. నగర స్వరూపం, గుర్తింపును కూడా పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది.
చెంపపెట్టు: ఉత్తమ కుమార్ రెడ్డి
హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఖరిపై చెంపపెట్టు అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ భవనాన్ని నిర్మించవద్దని హైకోర్టు పేర్కొందని, ఇది సర్కార్‌కు ఎదురుదెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు.