క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొన్న కారు - ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 16: హనుమాన్ జంక్షన్ సమీపంలోని నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పెదపాడు ఎస్‌ఐ జ్యోతిబస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కొరివి సాయి త్రిపుర మీర్జాపురంలోని బంధువుల ఇంటిలో ఆదివారం జరిగిన వర్ధంతి కార్యక్రమం కోసం తల్లి యార్లగడ్డ సుధారాణి (49), కుమారుడు మన్మంత్ (2)తో వచ్చింది. సోమవారం ఉదయం స్వగ్రామానికి వెళ్ళేందుకు మీర్జాపురం లో ఆటో ఎక్కారు. ఆటో నూజివీడు రైల్వే స్టేషన్ సమీపం వద్దకు రాగానే హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు వైపు వెళ్ళున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో సుధారాణి, మన్మంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కొరివి సాయిత్రిపుర తీవ్రంగా గాయపడడంతో అమెను కామినేని అసుపత్రికి తరలించారు.త్రిపుర 8 నెలల గర్భవతి. పైగా తీవ్రంగా గాయపడడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న మీర్జాపురం గ్రామస్తులు చింతరునీడి సాంబశివరావు, గొల్లపల్లి రవి, మరో మహిళ హైమావతికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని వివిధ అసుపత్రులకు వైద్యం నిమిత్తం తరలించారు.ప్రమాదం జరిగిన స్థలాన్ని ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాసరావు పరిశీలించారు. పెదపాడు ఎస్‌ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.