క్రైమ్/లీగల్

పల్లెవాడ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, సెప్టెంబర్ 16: కైకలూరు మండలం పల్లెవాడ సమీపంలో సోమవారం ఉదయం ఓ పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనటంతో బస్సులో ఉన్న సుమారు 38 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. గాయపడ్డ క్షతగాత్రులను హుటాహుటిన కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నర్సాపురం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 03జెడ్ 0053 నెంబరు గల ఆర్టీసీ బస్సు కైకలూరు నుండి నర్సాపురం వెళుతుండగా భీమవరం డిపోకు చెందిన ఏపీ 37 జెడ్ 0217 నెంబరు గల బస్సు భీమవరం నుండి ఏలూరు వస్తోంది. మండల పరిధిలోని పల్లెవాడ సమీపంలో ఎస్ టర్నింగ్ వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లతో పాటు బస్సులో 38 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వీరందరిని 108 అంబులెన్స్‌ల ద్వారా కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లారు. రెండు బస్సుల డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కైకలూరు రూరల్ ఎస్‌ఐ టి రామకృష్ణ తెలిపారు.