క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచారెడ్డి, సెప్టెంబర్ 16: విద్యుత్ షాక్ ముగ్గురు రైతులను పొట్టన బెట్టుకుంది. బోరు బావి నుంచి కాలిపోయన సబ్‌మెర్సిబుల్ మోటార్ పంపుసెట్టు బయటకు తీస్తుండగా పైన ఉన్న 11 కేవీఏ విద్యుత్ లైన్‌కు పైపు తగిలి ముగ్గురు రైతుల అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వెల్పుగొండ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఏముల స్వామికి చెందిన వ్యవసాయ బోరుబావి మోటార్ కాలిపోవడంతో దానిని బయటకు తీయడానికి ఐలేని మురళీధర్‌రావు(55) ఇమ్మిడి సత్యనారాయణ (51), అమ్మినేని లక్ష్మణ్‌రావు (62) వెళ్లారు. బోరుబావిలోని అన్ని పైపులు బయటకు తీశారు. చివరి పైపును బోరు మోటార్‌తో పైకి లేపుతున్న సమయంలో అదుపు తప్పి పక్కనే ఉన్న 11 కేవీఏ విద్యుత్‌లైన్‌కు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఆ ముగురూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సానుభూతి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాచారెడ్డి ఎస్‌ఐ మురళి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జీడిపల్లి నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు.