క్రైమ్/లీగల్

మీరు కాశ్మీర్ వెళ్ళొచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: జమ్మూ-కాశ్మీర్‌కు వెళ్ళేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ను సుప్రీం కోర్టు సోమవారం అనుమతించింది. అయితే అక్కడ ఎలాంటి రాజకీయ ర్యాలీలు నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా, అనంతనాగ్‌లకు వెళ్ళి అక్కడి ప్రజలను కలుసుకునేందుకు ఆజాద్‌కు అనుమతించింది. కాశ్మీర్ వెళ్ళి అక్కడి ప్రజల యోగ క్షేమాలను తెలుసుకోవాలని తన క్లయింట్ ఆజాద్ భావిస్తున్నారని ఆయన తరఫు లాయర్ ఏఎం సింఘ్వి కోర్టుకు తెలిపారు. గతంలో మూడు సార్లు ప్రయత్నించారని కానీ విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించారని కోర్టుకు నివేదించారు.