క్రైమ్/లీగల్

13ఏళ్ల బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 17: ఏడో తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలికను ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస గ్రామం నుండి వలస వచ్చిన ఓ కుటుంబం జక్కంపూడి కాలనీలో నివాసముంటోంది. వారికి 17ఏళ్ల బాలుడు, 13ఏళ్ల బాలిక ఉన్నారు. దంపతులిద్దరూ సోమవారం ఉదయం కృష్ణలంకలో పనిచేయడానికి బయటకు వెళ్లారు. వారి కుమారుడు కళాశాలకు వెళ్లాడు. కాలనీలో జిల్లా పరిషత్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలికను అదే కాలనీకి చెందిన సంగేపు నవీన్ అనే యువకుడు మధ్యాహ్నం 2గంటల సమయంలో తన ఇంటికి తీసుకెళ్లాడు. మాయమాటలతో మభ్యపెట్టి 4గంటల పాటు ఇంట్లోనే నిర్బంధించి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన బాలిక నలతగా ఉండగా తల్లిదండ్రులు అడగటంతో విషయాన్ని వివరించింది. దాంతో తర్జనభర్జనల అనంతరం మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.