క్రైమ్/లీగల్

ఓబులాపురం కేసు వైజాగ్ బదిలీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసును విశాఖపట్టణం సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఓఎంసీ అక్రమాల కేసులో గాలి జనార్ధనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ, విశ్రాంత ఐఎఎస్ అధికారి బీ కృపానందం, గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్‌పై సీబీఐ అభియోగపత్రాలను దాఖలు చేసింది.
సుమారు ఏడేళ్లుగా సీబీఐ కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓఎంసీ కేసును విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ కోరుతోంది. ఓబులాపురం గనులు అనంతపురం జిల్లాలో ఉన్నందున, విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని మంగళవారం నాడు హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజు వాదించారు. హైకోర్టు విభజన నేపథ్యంలో ఏఏ కేసులు ఎక్కడ విచారణ జరపాలో పేర్కొంటూ ఈ నెల 3వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, దాని ప్రకారం ఓఏసీ కేసును విశాఖకు బదిలీ చేయాలని కోరారు. సీబీఐ వాదనను నిందితుల తరఫున న్యాయవాదులు వ్యతిరేకించారు. జీవోలు అన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సచివాలయం కేంద్రంగా జారీ అయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే విచారణ కొనసాగించాలని వారు కోరారు. కేసు విచారణను అక్టోబర్ 1వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఆ రోజున ఇరువైపు పార్టీల పూర్తి స్థాయి వాదనలను వింటామని పేర్కొంది. మంగళవారం నాటి విచారణకు గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డి హాజరుకాగా, అనుమతితో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ కోర్టుకు హాజరు కాలేదు.