క్రైమ్/లీగల్

రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, సెప్టెంబర్ 17: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు తహశీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని వీఆర్వో కె.మదన్‌మోహన్ సుందరరావుపది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ వీవీఎస్‌ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో రెండు వాహనాలతో అధికారులు వచ్చి రెవెన్యూ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో మండలం నేరడి ఇన్‌చార్జి వీఆర్వో కె.మదన్‌మోహన్ సుందరరావును రూ.10 వేల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం నేరడి రెవెన్యూ గ్రూప్ పరిధిలో ఉన్న మెట్టూరుగూడకు చెందిన సవర సాయమ్మ అనే గిరిజన మహిళ స్వాధీనంలో ఉన్న 1.80 ఎకరాల భూమికి సంబంధించి అడంగల్, వన్బీ ఆన్‌లైన్ పత్రాలు కంప్యూటర్ ద్వారా వచ్చేలా మ్యుటేషన్ చేయాలని గత ఆరు మాసాలుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. అప్పటికే ఎన్నోమార్లు సాకులు చెబుతూ వీఆర్వో ఆమె పని పూర్తి చేయలేదు. కొద్ది రోజుల క్రితం సాయమ్మ అల్లుడు, సరుబుజ్జిలి మండలం వెనె్నలవలసకు చెందిన సవర మిన్నారావు సమస్య తెలుసుకొని వీఆర్వోను సంప్రదించాడు. ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటే రూ.20 వేలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేస్తూ ముందు రూ.10 వేలు ఇవ్వాలని, పని అయిన తర్వాత మిగతా రూ.10 వేలు ఇవ్వాలని చెప్పడంతో చేసేది లేక సాయమ్మ అల్లుడు మిన్నారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం 10 వేల నోట్లను వీఆర్వో సుందరరావుకు ఇవ్వగా రెడ్‌హ్యాండెడ్‌గా తహశీల్దార్ కార్యాలయంలోనే పట్టుకున్నారు.