క్రైమ్/లీగల్

అది రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చేసిన విజ్ఞప్తిని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నపుడు అనుసరించాల్సిన విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అవుతుందని న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా, బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది వరకు ఇద్దరు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా విమర్శించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఇప్పటికీ అంటరానితనం, వివక్ష దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉందని పేర్కొంటూ తీర్పును రిజర్వులో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రయత్నించిన మార్పులపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కేంద్రం కోరిన విధంగానే ఈ చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందంటూ ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆక్షేపించింది. అటు ప్రభుత్వ విజ్ఞప్తి, ఇటు ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు, రెండు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగానే ఉన్నాయని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వం కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అయితే, ఈ కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా తీర్పును వెల్లడించలేదు.