క్రైమ్/లీగల్

జీవోల గోప్యతపై హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చాలా వరకూ గోప్యంగా ఉంచుతోందని, ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంటూ బీజేపీ నేత పేరాల శేఖర్ హైకోర్టులో ప్రజావాజ్యపిటిషన్ దాఖలు చేశారు. జీవోలకోసం వెబ్ సైట్ ఉన్నా అందులో వాటిని పొందుపరచడం లేదని పేర్కొన్నారు. ప్రజలు జీవోలు చూసే విధంగా ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. 2014 జూన్ 2వ తేదీ తర్వాత నుండి చూసుకుంటే 2019 ఆగస్టు 15 వరకూ లక్ష నాలుగు వేల 171 జీవోలు ఇవ్వగా 42వేల 500 జీవోలు వెబ్‌సైట్‌లో లేవని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిల నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించి తెలంగాణ ప్రధాన కార్యదర్శికి, రెవిన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్ధిక శాఖ నుండి 11,995 జీవోలు ఇవ్వగా, పోర్టల్‌లో 6845 జీవోలు ఉన్నాయని 5150 జీవోలు లేవని, సాధారణ పరిపాలనా శాఖ నుండి 17,061 జీవోలు ఇవ్వగా 8008 ఉన్నాయని, 9053 జీవోలు పోర్టల్‌లో లేవని పేర్కొన్నారు. న్యాయశాఖ 5588 జీవోలు ఇవ్వగా, 735 అందుబాటులో లేవని, ఆరోగ్య శాఖ నుండి 5119 జీవోలు ఇవ్వగా 1235 లేవని, రెవిన్యూ శాఖ 4159 జీవోలు ఇవ్వగా 1528 జీవోలు పోర్టల్‌లో లేవని వివరించారు. వ్యవసాయ శాఖ 4656 జీవోలు ఇవ్వగా, 2036 జీవోలు లేవని, హోం శాఖ 7945 జీవోలు ఇవ్వగా 5371 జీవోలు అందుబాటులో లేవని, పంచాయతీరాజ్ శాఖ 4071 జీవోలు ఇవ్వగా, 2249 జీవోలు అందుబాటులో లేవని, రవాణా శాఖ 3137 జీవోలు ఇవ్వగా, 2069 జీవోలు అందుబాటులో లేవని, యువజన సర్వీసుల శాఖ 3835 జీవోలు ఇవ్వగా 2024 జీవోలు లేవని పేర్కొన్నారు.