క్రైమ్/లీగల్

హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్‌రెడి డ(57) సర్వీస్ రివాల్వర్‌తో కణతపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులకు హాజరైన సందర్భంగా పోలీస్ ఠాణాలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రకాష్‌రెడ్డి జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. పదోన్నతి పొందిన అనంతరం ఆయన మూడేళ్ల క్రితం డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా చేరారు. మండలాల పునర్విభజనలో భాగంగా ఇందల్వాయి నూతన మండలంగా ఏర్పాటవడంతో ఏడాదిన్నర క్రితం ప్రకాష్‌రెడ్డిని కొత్త ఠాణాలో పోస్టింగ్ కల్పించారు. ఆయన కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోనే ఉంటుండగా, ప్రకాష్‌రెడ్డి విధుల నిమిత్తం ఇందల్వాయికి రాకపోకలు సాగించేవారు. ఎప్పటిలాగే ఆయన బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సెక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించిన దామోదర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. విధుల నుండి రిలీవ్ అయిన దామోదర్ ఠాణాలోనే ముఖం కడుక్కునేందుకు స్టేషన్ వెనుక భాగంలోకి వెళ్లగా, కొద్దిసేపటికే పేలుడు శబ్దం వినిపించింది. దామోదర్‌తో పాటు ఠాణా ఆవరణను ఊడుస్తున్న స్వీపర్ సైతం మొదటగా ఏదైనా వాహనం టైరు పగిలిపోయి ఉంటుందని భావించారు. అయితే ఆ కొద్దిసేపటికే ఎస్‌ఐ గదిలో రివాల్వర్‌తో కాల్చుకుని రక్తపు మగుడులో హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్‌రెడ్డి పడి ఉండడాన్ని గమనించి హతాశులయ్యారు. విషయాన్ని ఎస్‌ఐ రాజశేఖర్‌కు వివరించగా, ఆయన హుటాహుటిన ఠాణాకు చేరుకుని ప్రకాష్‌రెడ్డిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రకాష్‌రెడ్డి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్‌రెడ్డి మృతదేహం, ప్రకాష్‌రెడ్డి (ఫైల్ ఫొటో)