క్రైమ్/లీగల్

గ్యాస్ చాంబర్‌లలోకి పంపి చంపేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు దాటినా ఇంకా భారతదేశంలో మనుషులతో మురికికాలువలు, మ్యాన్‌హోళ్లను ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా చేయించడం దారుణాతి దారుణం అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడా ‘చనిపోవడానికి గ్యాస్ చాంబర్లలోకి వెళ్లడం’ జరగడం లేదన్న సంగతిని గుర్తుంచుకోవాలని బుధవారం స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నా కులవివక్ష ఇంకా కొనసాగడం శోచనీయమని పేర్కొంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా సఫా యి పనులు, మ్యాన్‌హోళ్లను పరిశుభ్రం చేసే పనులను మనుషులతో ఎందుకు చేయిస్తున్నారని జస్టిస్ కేకే అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎంఆర్ షా, బీఆర్ గవాయ్‌ల బెంచ్ కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. ఈ పనులు చేసే వ్యక్తులకు రక్షణ చర్యల కింద మాస్కులను, ఆక్సిజన్ సిలిండర్లను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. ‘మురికి కాలువలు, స్కావెంజింగ్ పనులు చేసే వారికి మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లను ఎందుకు సరఫరా చేడం లేదు? ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ చనిపోవడానికి గ్యాస్ చాంబర్లలోకి పంపే విధానం అమలు కావడం లేదన్న సంగతిని గుర్తెరగాలని’ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న సంగతి అధికార యంత్రాంగానికి పట్టడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి పనులు చేస్తూ చనిపోతున్న సంఘటనలు తరచు జరగుతుండడాన్ని చూస్తుంటే ‘అమానవీయం’గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇటువంటి కేసులపై గత సంవత్సరం ఇచ్చిన కోర్టు తీర్పు ను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో.. ప్రత్యేకించి ఇలాంటి పనులు చేసేవారికి ఎలాంటి సదుపాయాలు వర్తించడం లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు సమీక్షించి పై వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఈ పనులను ఎస్సీ, ఎస్టీలే చేయడాన్ని చూస్తుంటే రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు ఏవౌతున్నాయని కోర్టు ప్రశ్నించింది. అంటరానితనం నేరం అని రాజ్యాంగంలో పేర్కొన్న సంగతిని మీరు గమనించారా? అని ప్రజలనుద్దేశించి పేర్కొంది. ‘మీరు ఎప్పుడైనా స్కావెంజర్లు, మురి కి కాలువలు శుభ్రం చేసే వారికి షేక్‌హ్యాండ్’ ఇచ్చారా..? ఇలాం టి పరిస్థితులు మారాలి.. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు దాటినా ఇంకా ఇటువంటి చర్యలు కొనసాగడం శోచనీయం’ అని బెంచ్ అభిప్రాయపడింది.