క్రైమ్/లీగల్

అయోధ్య కేసు విచారణ నెలలో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై దైనందిన విచారణ అక్టోబర్ 18 నాటికి పూర్తవుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ వెల్లడించారు. ఈ కేసు సీజే గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న సంగతి తెలిసిందే. స్థల వివాదంపై ఇరుపక్షాలకు చెందిన పార్టీలు మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా సామరస్యపూరిత పరిష్కారం కనుగొంటే కోర్టుకు అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎం కలీఫుల్లా అధ్యక్షతన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తమకు లేఖ రాసిందని గొగొయ్ స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి పార్టీలు మధ్యవర్తుల కమిటీ ద్వారా పరిష్కరించుకుందామని తమకు లేఖలు రాసినట్టు కలీఫుల్లా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.‘ కోర్టు ద్వారా ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీ ద్వారా సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. పరస్పర సహకారంతో ముందుకెళ్దాం. ఓ పరిష్కారం చూడండి’అంటూ కొందరు తమను అభ్యర్థించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తి కమిటీ ద్వారా సామరస్యపూరితమైన పరిష్కారం కనుగొంటే తమకు అభ్యంతరం లేదని దానికి తలుపులు మూసుకోలేదని బుధవారం ప్రకటించారు. ఆ ప్రక్రియ కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థల వివాదంపై రోజువారీ విచారణ పురోగతిన ఉందని, అది కొనసాగిస్తామని గొగొయ్ తెలిపారు. ఇరుపక్షాలూ కలీఫుల్లా కమిటీకి తమ వాదన వివిపించవచ్చని ఆయన సూచించారు. దైనందిన విచారణ వచ్చేనెల 18కి ముగిస్తామని న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం హిందూ, ముస్లింల పక్షాన వాదిస్తున్న లాయర్లకు తెలిపింది. విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచే అవకాశం కనిపిస్తోంది. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్న దృష్ట్యా ఈ లోపే అయోధ్యపై తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయోధ్య స్థల వివాదం కేసు ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ జరుగుతోంది. సమస్యకు సామరస్యపూరిత పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశంతో మధ్యవర్తుల కమిటీని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి కలీఫుల్లా నేతృత్వంలో ఆధ్యాత్మిక గురువుఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంఛూ సభ్యులుగా ఉన్నారు. మార్చి 8న కేసును విచారించిన సుప్రీం కోర్టు మరో ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. అయోధ్యకు ఏడు కిలోమీటర్ల దూరంలోని ఫజియాబాద్ వేదికగా సుప్రీం కోర్టు నిర్ణయించింది. మధ్యవర్తుల కమిటీకి కార్యాలయం, బస అలాగే ఇరుపార్టీలు ఉండడానికి బస, భద్రత, వాహనాల నిలపడాకి సౌకర్యాలు కల్పించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. మధ్యవర్తి కమిటీ నివేదిక రహస్యంగా ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2.77 ఎకరాల భూమి కి సంబంధించి అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఆ భూమిని మూడు పార్టీలకు సమానంగా పంచాలన్న హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

*చిత్రం...సుప్రీం కోర్టు సీజే గొగోయ్